‘ఖుషి’ లేటెస్ట్ అప్ డేట్ ఏంటి.?

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ప్రకటించినప్పుడు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ పెట్టడం ఏంటి అంటూ పవన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు కానీ.. శివ నిర్వాణ తను కూడా పవన్ ఫ్యాన్ అని.. ఈ సినిమాకి కరెక్ట్ గా సరిపోయే టైటిల్ కాబట్టి ఈ టైటిల్ పెట్టానని.. ఆ టైటిల్ కు ఉన్న పేరును చెడగొట్టను అన్నారు. అలా చెప్పినప్పటి నుంచి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది.  కొంతకాలంగా షూటింగ్ కి బ్రేక్ పడుతూ వచ్చిన ఖుషి ఇప్పుడు స్పీడుగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ పాటకు అనూహ్య స్పందన వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసింది. ఇంతకీ ఖుషి షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ప్రస్తుతం టర్కీలో విజయ్ దేవరకొండ, సమంత పై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. విజయ్, సమంత ఖుషి మూవీ కోసం టర్కీలో పాట చిత్రీకరిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇందులో విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తుంటే.. సమంత కాశ్మీర్ అమ్మాయిగా నటిస్తుంది.

విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత, డైరెక్టర్ శివ నిర్వాణ.. ఈ ముగ్గురుకి సక్సెస్ కావాలి. అందుచేత ఎంతో కసితో ఈ సినిమా చేస్తున్నారు. మరి.. ఈ ఖుషి ఆ ఖుషి రేంజ్ సక్సెస్ సాధించి ఈ ముగ్గురిని మళ్లీ ఫామ్ లోకి తీసుకువస్తుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *