కీలకమైన సమయంలో ‘రంగబలి’ని దింపుతున్న నాగశౌర్య!

నాగశౌర్య హీరోగా ఎంట్రీ ఇచ్చేసి పుష్కర కాలం గడిచిపోయింది. అప్పటి నుంచి కూడా ప్రేక్షకుల నుంచి పెద్దగా గ్యాప్ రాకుండా చూసుకుంటూ వెళుతున్నాడు. ఇండస్ట్రీలో యంగ్ హీరోలు ఎంతమందికి ఉన్నప్పటికీ,. లవర్ బాయ్ ఇమేజ్ చాలా కొంతమందికి మాత్రమే దక్కుతూ ఉంటుంది. యూత్ వైపు నుంచి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా కొంతమందికి మాత్రమే ఉంటుంది. అలా లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోల్లో నాగశౌర్య ఒకరుగా కనిపిస్తాడు.

నాగశౌర్య మంచి హీరో మెటీరియల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. యాక్షన్ ను .. రొమాన్స్ ను పండించగల సమర్థుడే. కెరియర్ ఆరంభంలో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ వచ్చిన నాగశౌర్య, ఆ తరువాత కాలంలో పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. ఒక వైపున తన సొంత బ్యానర్లో .. మరో వైపున ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాడు. అయినా ఆయన హిట్ అనే మాట వినేసి చాలా కాలమైంది. ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ట్రై చేస్తూనే, వరుసగా ఇప్పుడు ఆయన నాలుగైదు ఫ్లాపులు ఇచ్చేసి ఉన్నాడు.

ఈ సమయంలో నాగశౌర్య మరింత పకడ్బందీగా ప్లాన్ చేసుకుని కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావలసిన పరిస్థితి. కానీ చాలాకాలంగా ఆలస్యమవుతూ వచ్చిన ‘రంగబలి’ సినిమాను ఆయన రిలీజ్ కి దింపుతున్నాడు. జులై 7వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించాడు. పవన్ సీహెచ్ దర్శకత్వం వహించాడు. మరి ప్రస్తుతం నాగశౌర్య ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా ఆయనను ఎంతవరకూ కాపాడుతుందనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *