రెండు భాగాలుగా ప్రభాస్, మారుతి మూవీ?

ప్రభాస్, మారుతి సినిమా షూటింగ్  శరవేగంగా  జరుగుతోంది.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫుటేజ్ చూసి ప్రభాస్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడని… సినిమా సక్సెస్ పై పూర్తి నమ్మకంతో ఉన్నాడని తెలిసింది.

అయితే.. ఇప్పుడు అంతా రెండు పార్టులుగా సినిమా తీయడం అనేది ట్రెండ్ గా మారింది. ప్రతి భారీ సినిమా రెండు పార్టులుగా రానుందని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్, మారుతి మూవీ కూడా రెండు పార్టులుగా రానుందని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. సలార్…. ప్రాజెక్ట్ కే కూడా రెండు పార్టులుగా వస్తాయని వినిపిస్తుంది. ఇప్పుడు మారుతితో చేస్తున్న మూవీ కూడా రెండు పార్టులుగా రానుందని వార్త రావడంతో ఇది హాట్ టాపిక్ అయ్యింది. ప్రచారంలో ఉన్న ఈ వార్తపై ఆరా తీస్తే తెలిసింది కేవలం ఒక పార్ట్ గానే రానుందని తెలిసింది.

ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ప్రాజెక్ట్ కే చిత్రాన్ని దాదాపు 500 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని.. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు మారుతితో చేస్తున్న మూవీని విడుదల చేయద్దని  ప్రభాస్ కు అశ్వనీదత్ గట్టిగా చెప్పారట. అందుకనే ప్రాజెక్ట్ కే సంక్రాంతికి విడుదల చేసి.. మారుతితో చేస్తున్న మూవీని సమ్మర్ లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *