చైతూ నెక్ట్స్ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు.?

అక్కినేని నాగచైతన్య ఇటీవల ‘కస్టడీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో…  తెలుగు, తమిళ్ లో రూపొందిన  ఈ సినిమా  ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అంతకుముందు వచ్చిన థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా…  ఇప్పుడు కస్టడీ ఇలా వరుసగా మూడు చిత్రాలతో నిరాశపరచడంతో ఎలాంటి సినిమా చేయాలనె ఆలోచనలో పడ్డాడు చైతన్య.  ప్రస్తుతం కథలు వింటున్నాడు. ఇంకా తన నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు.

తాజా సమాచారం ప్రకారం.. చందు మొండేటితో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని తెలిసింది. గతంలో చైతూ, చందు కలిసి ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలు చేశారు. ఇందులో ప్రేమమ్ సక్సెస్ సాధించగా సవ్యసాచి ప్లాఫ్ అయ్యింది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రూపొందే చిత్రాన్ని జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించనున్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని జులై నుంచి సెట్స్ పైకి తీసుకురావాలి అనేది ప్లాన్ అని తెలిసింది. అయితే.. ఈ సినిమాకి కథ మాత్రం చందు మొండేటిది కాదని.. వేరే కథను తీసుకున్నారని టాక్. సున్నితమైన కథ అని.. చైతన్యకు కరెక్ట్ గా సెట్ అవుతుందని.. అందుకనే ఈ  సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని సమాచారం.

ఈ సినిమా తర్వాత చైతన్యతో సినిమా చేసేందుకు శివ నిర్వాణ, కిషోర్ తిరుమల వెయిటింగ్ లో ఉన్నారు కానీ.. వీరిద్దరూ ఇంకా కథను చైతన్యకు చెప్పలేదని తెలిసింది. శివ నిర్వాణ ఖుషి సినిమా బిజీలో ఉన్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ . ఆతర్వాత చైతన్య కోసం కథను రెడీ చేస్తాడు. ఇక కిషోరు తిరుమల ఎప్పటి నుంచో చైతన్యతో సినిమా చేసేందుకు కథ రెడీ చేస్తున్నాడు. ఫ్యామిలీ స్టోరీ రెడీ చేశాడని.. త్వరలోనే నెరేషన్ ఇవ్వనున్నాడని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *