Wednesday, May 8, 2024
Homeసినిమా‘గుంటూరు మిర్చి’గా వస్తున్న మెహ‌బూబ్

‘గుంటూరు మిర్చి’గా వస్తున్న మెహ‌బూబ్

యూట్యూబ్ వేదికగా వెబ్ సిరీస్ విభాగంలో ప‌లు బ్లాక్ బస్ట‌ర్స్ సిరీస్ లు ప్రేక్ష‌కుల‌కి అందిస్తున్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఇన్ఫినిట‌మ్ నెట‌వ‌ర్క్ సొల్యూష‌న్స్ వారు బిగ్ బాస్ ఫేమ్, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మెహ‌బూబ్ హీరోగా ‘ఫుల్ గుంటూరు మిర్చి’ అనే వెబ్ సిరీస్ ని నిర్మించారు.  జూలై 29న మెహబూబ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ వెబ్ సిరీస్ టీజ‌ర్ విడుదలైంది. ఫీచ‌ర్ ఫిల్మ్ కి ఏ మాత్రం త‌గ్గ‌ని రీతిలో పక్కా మాస్ గా ఈ సిరీస్ ని రూపొందించారు. టీజ‌ర్ లో మెహ‌బూబ్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

యూత్ తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించేట్లుగా ఉన్న ఈ టీజ‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్లుగా ప్ర‌ణ‌వి మానుకొండ‌, రితిక చక్ర‌బ‌ర్తి న‌టిస్తున్నారు. ఈ సిరీస్ కి ద‌ర్శ‌కుడుగా డాక్ట‌ర్ అనిల్ విశ్వ‌నాథ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు, క‌థ‌ను ఎస్.డి.చ‌ద్ధా అందించారు. అతి త్వ‌ర‌లో ఈ సిరీస్ కి సంబంధించిన విడుద‌ల తేది త‌దిత‌ర వివ‌రాలు అధికారికంగా విడుద‌ల కానున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్