Friday, June 12, 2026
HomeTrending Newsయాత్ర ఫర్ చేంజ్ వాయిదా, 28న పునః ప్రారంభం

యాత్ర ఫర్ చేంజ్ వాయిదా, 28న పునః ప్రారంభం

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సె హాత్ జోడో యాత్ర నాలుగు రోజుల పాటు వాయిదా పడింది. భూపాలపల్లి నియోజకవర్గంలో 28వ తేదీన రేవంత్‌రెడ్డి మరోసారి పర్యటించనున్నారు. ఈ రోజు నుంచి 26 వరకు ఛత్తీస్‌గఢ్‌ రాజధాని నయారాయపూర్‌లో ఏఐసీసీ ప్లీనరీ ఉండటంతో జోడో యాత్రను వాయిదా వేశారు. 27న పరకాల నియోజకవర్గంలో పాల్గొననున్న రేవంత్‌రెడ్డి, 28న భూపాలపల్లి నియోజకవర్గంలో యాత్ర చేస్తారు. భూపాలపల్లి పట్టణ పరిధి కాశీంపల్లి నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు పాదయాత్ర చేస్తారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నక్సల్స్‌ ప్రాబల్య ప్రాంతాల్లో కాంగ్రెస్‌పై పట్టు కోసం ప్రయత్నిస్తున్న రేవంత్‌ రెడ్డి భూపాలపల్లి జిల్లా చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో అడుగుపెడుతున్నారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు టీపీసీసీ సభ్యుడు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read : పోడు భూములపై కెసిఆర్ మోసపూరిత హామీలు- రేవంత్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular