Friday, November 22, 2024
HomeTrending Newsపాక్ పంజాబ్ ముఖ్యమంత్రిగా హమ్జా షాబాజ్

పాక్ పంజాబ్ ముఖ్యమంత్రిగా హమ్జా షాబాజ్

పాకిస్థాన్‌లోని పంజాబ్ ముఖ్యమంత్రిగా హమ్జా షాబాజ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. నల్లటి శేర్వాని ధరించిన హమ్జా షాబాజ్ తో గవర్నర్ బలిఘుర్ రహమాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇస్లామాబాద్ పంజాబ్ గవర్నర్ హౌసులోజరిగిన కార్యక్రమంలో పీఎంఎల్-ఎన్ నేతలు పాల్గొన్నారు. ప్రధాని షాబాజ్ షరీఫ్ కుమారుడు హమ్జా షాబాజ్ పంజాబ్ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర గందరగోళం నడుమ 197 ఓట్లతో పంజాబ్ 21వ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

కాగా, కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే సమావేశాన్ని పార్టీ బహిష్కరించడంతో డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీపై దాడి చేసినందుకు గాను పంజాబ్ అసెంబ్లీకి చెందిన ముగ్గురు పీటీఐ సభ్యులను ఓటు వేయడానికి ముందే అరెస్ట్ చేశారు. తన పార్టీతోపాటు పీటీఐ ఎన్నికను బాయ్‌కాట్ చేయడంతో హమ్జా ప్రత్యర్థి పర్వైజ్ ఎలాహికి ఎలాంటి ఓట్లు రాలేదు. ఏప్రిల్ లో పార్టీ ఫిరాయించిన మాజారీపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీకి చెందిన చట్ట సభ్యులు దాడి చేశారు. ఆయన జుట్టు పట్టుకుని లాగారు. చెంప చెళ్లుమనిపించారు. పిడిగుద్దులు కురిపించారు. ఆపై ఈడ్చిపడేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను రక్షించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్