Sunday, March 8, 2026
Homeసినిమా'105 మినిట్స్‘ గ్లింప్స్ లాంచ్ చేసిన సెంథిల్

‘105 మినిట్స్‘ గ్లింప్స్ లాంచ్ చేసిన సెంథిల్

Hansikas 105 Minutes Glimpse Released By Senthil Kumar :

హన్సిక మొత్వాని కథానాయికగా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా సింగిల్ షాట్, సింగిల్ రెక్టర్’ తో ఉత్కంఠభరితంగా సాగిపోయే కథ, కథనంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘105 మినిట్స్’.  ఈ మూవీ గ్లింప్స్ వీడియోని పాపులర్ సినిమాటోగ్రాఫర్ కె. కె. సెంథిల్ కుమార్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సెంథిల్ కుమార్ మాట్లాడుతూ “హాలీవుడ్ లో మాత్రమే ప్రయత్నించిన సింగిల్ షాట్ చిత్రీకరణకి నేను పెద్ద అభిమానిని, అలా మానవాళ్లెవరు చెయ్యట్లేదు అనుకుంటుండగా ‘ 105 మినిట్స్ ‘ రాజు చేసి చూపిస్తున్నారు. కథ కథనం చాలా థ్రిల్లింగ్ గా అనిపించాయి.  105 మినిట్స్ సింగిల్ షాట్ అంటే ఒక టెక్నీషియన్ గా అది ఎంత కష్టమో నాకు తెలుసు. మన తెలుగు పరిశ్రమలో ఇలాంటి కొత్త తరం ఆలోచనతో కథలు తెరకెక్కిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఒక రిస్కి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా గట్స్ ఉండాలి. అనుక్కున్నట్టుగా తీసిన చిత్ర బృందం అంతటికి ఈ చిత్రం పెద్ద సక్సెస్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు, సామ్ సి.యస్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలని వేగంగా జరుపుతుంది చిత్ర బృందం.

Must Read : తెలుగు సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular