Monday, June 8, 2026
Homeసినిమా పుష్పక విమానం లేటెస్ట్ అప్ డేట్

 పుష్పక విమానం లేటెస్ట్ అప్ డేట్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతటి ఇమేజ్ ఉందో తెలిసిందే. ప్రస్తుతం లైగర్ మూవీ చేస్తున్నాడు. అయితే.. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా టాలీవుడ్ లో హీరోగా రాణించడానికి కృషి చేస్తున్నాడు. తన తొలి చిత్రం నుంచి కెరీర్ ని ఎంతో చక్కగా ప్లాన్ చేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాడు. ‘దొరసాని’తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ తొలి చిత్రంతోనే నటుడుగా మెప్పించాడు. ఆతర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తో మరింత గుర్తింపు  సాధించాడు.

ఇప్పుడు ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం సినిమా చేస్తున్నారు. దామోదర దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా విజయ్ దేవర కొండ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి విజయ్ దేవరకొండ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ ని అనౌన్స్ చేశాడు.

ఆంధ్ర, సీడెడ్ నుంచి సురేష్ ప్రొడక్షన్స్, నైజాం లో గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ఓవర్సీస్ మార్కెట్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిల్మ్స్ వారు విడుదల చేస్తున్నట్టుగా విజయ్ దేవర కొండ స్పష్టం చేశారు. ఈ ‘పుష్పక విమానం’ వచ్చే నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular