Monday, June 8, 2026
Homeసినిమా‘బ్యాక్ డోర్'కు రాఘవేంద్రరావు ఆశీస్సులు

‘బ్యాక్ డోర్’కు రాఘవేంద్రరావు ఆశీస్సులు

పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘బ్యాక్ డోర్’. ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్-యు సెన్సార్ సర్టిఫికెట్ లభించడం తెలిసిందే. తాజాగా ‘బ్యాక్ డోర్’ ట్రైలర్ ను లెజండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు విడుదల చేసి ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.

రాఘవేంద్రరావు మాట్లాడుతూ “బ్యాక్ డోర్ టీజర్ కి పది మిలియన్ వ్యూస్ వచ్చాయని విన్నాను. ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. దీనికి ఖచ్చితంగా రెట్టింపు వ్యూస్ వస్తాయి. టీమ్ కి ఆల్ ది బెస్ట్” అన్నారు. లెజండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు తమ చిత్రం ట్రైలర్ లాంచ్ చేసి, బెస్ట్ విషెస్ చెప్పడం పట్ల దర్శకుడు కర్రి బాలాజీ, హీరో తేజ త్రిపురాన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అంబికా రాజా ప్రత్యేక అతిధిలుగా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular