Monday, June 8, 2026
Homeసినిమాశరవేగంగా సాగుతున్న హన్సిక ‘మై నేమ్ ఈజ్ శృతి’

శరవేగంగా సాగుతున్న హన్సిక ‘మై నేమ్ ఈజ్ శృతి’

ప్రముఖ కథానాయిక హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. ది హిడెన్‌ ట్రూత్‌ అనేది ఉపశీర్షిక. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకం పై రమ్య బురుగు, నాగేందర్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకుడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజే స్తూ… ‘బ్యాక్‌ అండ్‌ ఫోర్త్‌ స్క్రీన్‌ప్లేతో హన్సిక ఇప్పటి వరకు తన కెరియర్‌లో పోషించనటువంటి సరికొత్త పాత్రలో నటిస్తోంది. ఈ సస్సెన్స్‌ థ్ల్రిలర్‌ ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతిని కలిగిస్తుంది.

ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేది చిత్ర కథాంశం. ఆగస్టు రెండో వారంలో రెండో షెడ్యూల్‌ని ప్రారంభిస్తాం అన్నారు. మురళీశర్మ, జయప్రకాష్‌, ఆడుకాలం నరెన్‌, రాజా రవీంద్ర, సీవీఎల్‌ వినోదిని, సాయితేజ్‌ కాల్వకోట, మహేష్‌ తదితరులు నటిస్నున్న ఈ చిత్రానికి కెమెరా: కిషోర్‌ బోయిడపు, సంగీతం: మార్క్‌.కె.రాబిన్‌, ఎడిటర్‌: చోట.కె.ప్రసాద్‌, ఆర్ట్‌: గోవింద్‌ ఇరసాని, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సుబ్బరావు గూడపాకల, లైన్ ప్రొడ్యూసర్‌: కె.విజయ్‌కుమార్‌, సహ నిర్మాతలు: పవన్‌కుమార్‌ బండి, ఎజీ ఎలియస్‌, రచన-దర్శకత్వం: శ్రీనివాస్‌ ఓంకార్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular