Sunday, June 14, 2026
Homeసినిమామూడు భాషల్లో హాన్సిక  ‘మై నేమ్‌ఈజ్ శృతి’

మూడు భాషల్లో హాన్సిక  ‘మై నేమ్‌ఈజ్ శృతి’

Hansika- Sruthi: ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ఈజ్ శృతి’. ఇటీవల విడుదలైన టీజర్‌లో ‘చర్మం వలిచి బిజినెస్ చేస్తానమంటున్నారు ఏం చేయాలి వాళ్లను’ అంటూ కథానాయిక హాన్సిక చెప్పే డైలాగ్‌తో చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. హాన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఇటీవల తెలుగులో విడుదలైన టీజర్ చక్కని స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన హిందీ, తమిళ టీజర్‌లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర‌ నిర్మాత మాట్లాడుతూ “తెలుగులో విడుదల చేసిన టీజర్‌కు అనూహ్యమైన స్పంద‌న వ‌చ్చింది. టీజర్ ఆద్యంతం ఆసక్తిగా వుండటంతో సినిమా పై మంచి క్రేజ్ ఏర్పడింది. వైవిధ్యమైన కాన్సెప్ట్‌ తో, ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తికరంగా దర్శకుడు మలిచాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ “ఈ సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఉంటుంది. ముగింపువరకు ఎవరూ ఊహించలేని ట్విస్ట్‌ లతో ఈ సినిమా వుంటుంది. ఖ‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంది” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular