Saturday, July 27, 2024
HomeసినిమాPrabhas: మరో లవ్ స్టొరీకి ప్రభాస్ ఒకే!

Prabhas: మరో లవ్ స్టొరీకి ప్రభాస్ ఒకే!

‘బాహుబలి’తో చరిత్ర సృష్టించిన ప్రభాస్ తో టాలీవుడ్ మేకర్స్ తో పాటు బాలీవుడ్ మేకర్స్ కూడా సినిమాలు చేయాలను కుంటున్నారు. అయితే.. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్ జూన్ 16న విడుదల కానుంది. ఇక సెప్టెంబర్ 28న క్రేజీ మూవీ ‘సలార్’ విడుదల కానుంది.  సంక్రాంతికి పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’ విడుదల కానుంది. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న ప్రభాస్ కోసం అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ‘స్పిరిట్’ మూవీ కోసం వెయిటింగ్ లో ఉన్నాడు.వ్ ఇందులో ప్రభాస్ యాటీట్యూడ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందట. నెక్ట్స్ ఇయర్ మిడ్ లో ఈ చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నారు.

తాజాగా ప్రభాస్ మరో డైరెక్టర్ కి ఓకే చెప్పాడట. ‘సీతారామం’తో బ్లాక్ బస్టర్ సాధించిన హను రాఘవపూడి. ప్రభాస్ కోసం ఓ లవ్ స్టోరీ హను రెడీ చేస్తున్నాడట. ఇది భారీ సెటప్ లో చేయాల్సిన కథ అని తెలిసింది. ప్రభాస్ లవ్ స్టోరీ చేసి చాన్నాళ్లు అయ్యింది. రాధేశ్యామ్ లవ్ స్టోరీనే కానీ… అందులో ఫాంటసీ వరల్డ్ ఉంటుంది.

హను తెరకెక్కించిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ అందులో లవ్ స్టోరీలు మాత్రం అద్భుతంగా క్రియేట్ చేయగలిగాడు. అందుచేత హనుతో లవ్ స్టోరీ చేయడానికి ప్రభాస్ ఓకే చెప్పాడట. అయితే.. ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యే ఛాన్స్ లేదు. కారణం ఏంటంటే.. ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుచేత ఈ గ్యాప్ లో హను ఓ సినిమా చేస్తాడని టాక్. ప్రభాస్, హను కాంబోలో లవ్ స్టోరీ సెట్ అయితే.. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయం అనే టాక్ ఉంది. మరి.. ఎప్పుడు సెట్ అవుతుందో క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్