Friday, March 13, 2026
Homeసినిమా200 Days: చరిత్రను తిరగరాసినట్టుగా అనిపిస్తుంది: చిరంజీవి

200 Days: చరిత్రను తిరగరాసినట్టుగా అనిపిస్తుంది: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం 2023 సంక్రాంతికి విడుదలై  అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. పలు థియేటర్లలో విజయవంతంగా 200 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ టీమ్ కు, డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్స్ అందించారు. చిరంజీవి, రవితేజ తో పాటు హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు సాన ఈ వేడుకలో పాల్గొన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ.. ” ఒకప్పుడు సినిమాలు 100, 175, 200 రోజులు.. సిల్వర్ జూబ్లీ లు ఆడేవి. ఇప్పుడు.. రెండు వారాల్లో అటు ఇటు తేలిపోతుంది. ఇలాంటి నేపథ్యంలో ‘వాల్తేరు వీరయ్య’  200 రోజులు ప్రదర్శిచడం ఆనందంగా ఉంది. రెండు వందల రోజులు సినిమా ఆడి, విజయానికి గుర్తుగా షీల్డ్ ఇచ్చిపుచ్చుకోవడం చూస్తుంటే ఒళ్లు పులకరిస్తోంది. అందరు కలసికట్టుగా పని చేస్తే మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందనడానికి ఇది నిదర్శనం. చరిత్రను తిరగరాసినట్టుగా అనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారు, చెర్రీ గారికి నా హృదయపూర్వక అభినందనలు. నా తమ్ముడు రవితేజ ఈ సినిమా ఒప్పుకోవడం అనేది ఈ సినిమా మరో స్థాయికి వెళ్ళడానికి కారణం. తను సహాయ దర్శకుడిగా ఉన్నప్పటి నుంచి తెలుసు. ఈ రోజు మాస్ మహారాజా గా ఎదగడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. తను   మోస్ట్ బిజియస్ట్ హీరో. ఏడాదికి దాదాపు ఐదు సినిమాలు చేస్తున్నాడు. ఇది చాలా మంచి పరిణామం. ఎక్కువ సినిమాలు చేస్తే ఎంతో మందికి ఉపాది లభిస్తుంది. తన వేగంతో నేనూ ధీటుగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను(నవ్వుతూ). తను ఇదు సినిమాలు చేస్తున్నాడు. నేను సుస్మితకి ఒక సినిమా, యువీ క్రియేషన్ కి మరో సినిమా చేస్తున్నాను. వాల్తేరు వీరయ్యకి పని చేసిన అందరికీ ధన్యవాదాలు” తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular