Sunday, January 19, 2025
HomeTrending Newsపాక్ లో మైనారిటీలపై పెరిగిన వేధింపులు

పాక్ లో మైనారిటీలపై పెరిగిన వేధింపులు

దేశ విభజన అనంతరం పాకిస్తాన్‌లో హిందువుల జనాభా క్రమంగా తగ్గిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 22 లక్షల మంది హిందువులు ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌లో మొత్తం నమోదిత జనాభా 18 కోట్ల 68 లక్షలుగా ఉండగా వారిలో మైనారిటీ హిందువుల జనాభా 1.18శాతంగా ఉన్నట్టు సెంటర్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ పాకిస్తాన్‌లో పేర్కొంది.
నేషనల్‌ డేటాబేస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అథారిటీ (ఎన్‌.ఎ.డి.ఆర్‌.ఎ) డేటా ప్రకారం, పాకిస్తాన్ మొత్తం జనాభాలో మైనారిటీల సంఖ్య ఐదు శాతం కంటే తక్కువే. వారిలో మైనారిటీ హిందువులే అత్యధికమని తాజా నివేదిక వెల్లడించింది.
ఎన్‌ఐడీఆర్‌ఏ నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌లో 18 కోట్ల 68లక్షల జనాభా ఉండగా వారిలో 18 కోట్ల 25 లక్షల మంది ముస్లింలే ఉన్నారు. అక్కడ నివసిస్తోన్న వారి మతాలు, విశ్వాసాల ఆధారంగా మైనారిటీల సంఖ్యను అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 22లక్షల 10వేల (22,10,566) మంది హిందువులు ఉండగా.. 18,73,348 మంది క్రైస్తవ జనాభా ఉన్నట్టు తేలింది.
అహ్మదీలు లక్షా 88వేల మంది, సిక్కులు 74వేలు, భయాస్‌ 14వేలతోపాటు మరో 3917 మంది పార్సీలు ఉన్నట్టు వెల్లడించింది. ఇక 2 వేల కంటే తక్కువ జనాభా కలిగిన మైనారిటీ వర్గాలు పాకిస్తాన్‌లో 11 ఉన్నట్టు గుర్తించింది. బౌద్ధమతస్థులు 1787, చైనీయులు 1151, ఆఫ్రికన్‌ మతాలకు చెందినవారు 1418 మందితోపాటు మరికొన్ని వందల సంఖ్యలో ఇతర వర్గాలు వారు ఉన్నట్లు ఎన్‌ఐడీఆర్‌ఏ నివేదిక పేర్కొంది.
ఇదిలాఉంటే, 2 శాతం కంటే తక్కువగా ఉన్న హిందువులతోపాటు అహ్మదీలు, క్రైస్తవులపై ఇటీవల వేధింపులు ఎక్కువైనట్టు నివేదికలు వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, హిందువులతోపాటు ఇతర మైనారిటీలుగా ఉన్న వారిలో దాదాపు 95శాతం మంది సింధ్‌ ప్రావిన్సులోనే జీవిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ చట్టసభల్లో మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యం కూడా లేదనే చెప్పవచ్చు.

Also Read : పాకిస్తాన్లో బిహారీల కష్టాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్