Sunday, September 8, 2024
HomeTrending NewsKhalistan: ఖలిస్థానీలకు గట్టి ఎదురుదెబ్బ

Khalistan: ఖలిస్థానీలకు గట్టి ఎదురుదెబ్బ

ఖలిస్తాని వేర్పాటువాదులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత్ ను ఇబ్బంది పెట్టె విధంగా అంతర్జాతీయ వేదికలపై వేర్పాటువాద గళం వినిపిస్తున్న ఖలిస్తానీలకు ఉహించని పరిణామం ఎదురైంది. భారత ప్రభుత్వం ‘వాంటెడ్ టెర్రరిస్ట్’ గా ప్రకటించిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (46) హత్యకు గురయ్యాడు. కెనడాలోని సర్రేలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో హర్దీప్ మరణించాడు.
ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ సభ్యులకు కార్యకలాపాల నిర్వహణ, నెట్ వర్క్ ఏర్పాటు చేయడం, శిక్షణ, ఆర్థిక సహకారం వంటివి హర్దీప్ చేస్తుంటాడు. ఇతడిపై జాతీయ దర్యాప్తు సంస్థ భారత్ లో ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. హర్దీప్  సింగ్ కు సిక్ ఫర్ జస్టిస్ సంస్థతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాలో ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఇతడి హస్తం ఉంది.
పలు భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న హర్దీప్ ను  కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 40 మంది ఉగ్రవాదుల జాబితాలోనూ నిజ్జర్ పేరు  ఉంది. 2022లో పంజాబ్‌లో ఓ హిందూ అర్చకుడి హత్యకు కుట్ర పన్నాడని హర్దీప్ పై ఆరోపణలు ఉన్నాయి.  దీంతో అతనిపై నేషనల్ ఇన్వెష్టిగేషన్ ఏజెన్సీ రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్