Friday, March 20, 2026
Homeస్పోర్ట్స్BCCI Selection: పాండ్యాకు పగ్గాలు, ధావన్ పై వేటు

BCCI Selection: పాండ్యాకు పగ్గాలు, ధావన్ పై వేటు

టీమిండియా వన్డే  జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ కు నిరాశ మిగిలింది. శ్రీలంకతో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ కు ధావన్ ను సెలక్టర్లు పక్కనపెట్టారు.  ఇటీవలి బంగ్లాదేశ్ టూర్ లో  ధావన్ విఫలమయ్యాడు. జట్టు 2-1 తో సిరీస్ కూడా కోల్పోవాల్సి వచ్చింది. అందుకే ధావన్ ను సెలక్టర్లు పరిగణన లోకి తీసుకోలేదని తెలిసింది.

కాగా, వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా  కొనసాగుతారు, టి 20 సారధ్య బాధ్యతలు మాత్రం హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. వైస్ కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ను ఎంపిక చేశారు. టి 20 జట్టు నుంచి రోహిత్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ లను దూరం పెట్టారు. పేస్ బౌలర్లు శివమ్ మావి, ముఖేష్ కుమార్ లు తొలిసారి జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నారు.

జనవరి 3 నుంచి 15 వరకూ శ్రీలంకతో మూడు వన్డేలు, మూడి టి 20లు టీమిండియా ఆడనుంది.

జట్టు వివరాలు:

వన్డే: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, షామీ, సిరాజ్, ఉమ్రాన్ మ్మాలిక్. అర్ష్ దీప్ సింగ్

టి 20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శామ్సన్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్ దీప సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేష్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular