Sunday, January 19, 2025
Homeసినిమాతాప్సీ ‘మిష‌న్ ఇంపాజిబుల్‌’ లో హ‌రీశ్ పేర‌డి

తాప్సీ ‘మిష‌న్ ఇంపాజిబుల్‌’ లో హ‌రీశ్ పేర‌డి

తెలుగులో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి, ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగు పెట్టి వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న స్టార్ తాప్సీ. `మిష‌న్ ఇంపాజిబుల్‌` సినిమాతో తెలుగులో తాప్సీ రీ ఎంట్రీ ఇస్తోంది. తాప్సీ లీడ్ రోల్ చేస్తోన్న ఈ సినిమాకు `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` చిత్రంతో హిట్ కొట్టిన స్వ‌రూప్ ఆర్.ఎస్‌.జె దర్శకత్వం వహిస్తున్నారు.

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్ర‌ముఖ స్టార్స్ అంద‌రూ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇందులో ఒక కీలకమైన పాత్ర కోసం మ‌ల‌యాళ న‌టుడు హ‌రీశ్ పేర‌డీని ఎంపిక చేశారు. ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లో త‌నకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవ‌డమే కాక, క‌ళ్ల‌తోనే విల‌నిజాన్ని చూపిస్తూ గుర్తింపు పొందారు. ఎరిడ, తంబి, మెర్స‌ల్‌, ఖైది, స్పైడ‌ర్‌, రాక్ష‌సి, పులి మురుగన్‌, భూమియిలే, మ‌నోహ‌ర‌, స్వ‌కార్యం, మ‌డ్డి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్‌, విక్ర‌మ్ వేద చిత్రాలు ఆయనలోని వైవిధ్యాన్ని చాటిచెప్పాయి.

ఈ చిత్రానికి ఎన్ ఎం పాష అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌. దీప‌క్ య‌ర‌గ‌ర సినిమాటోగ్రాఫ‌ర్‌, మార్క్ కె రాబిన్ సంగీత ద‌ర్శ‌కుడు, ర‌వితేజ గిరిజ‌ల ఎడిట‌ర్‌. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్