Saturday, January 18, 2025
Homeసినిమావీర‌మ‌ల్లు..అనుకున్న సమయానికి వచ్చేనా?

వీర‌మ‌ల్లు..అనుకున్న సమయానికి వచ్చేనా?

Delay: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. ఈ సినిమాని ప్రారంభించి చాన్నాళ్లు అయ్యింది కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ పూర్తి కాలేదు. క‌రోనా ఓ కార‌ణం అయితే.. ప‌వ‌న్ వేరే సినిమాల్లో బిజీ కావ‌డం మ‌రో కార‌ణం. ఈ నెల 6 నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ప‌వ‌ర్ క‌ళ్యాణ్ పై భారీ యాక్ష‌న్ సీన్స్ ను చిత్రీక‌రించారు.

సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలి అనుకున్నారు. ఈ స‌మ్మ‌ర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ద‌స‌రాకి రిలీజ్ చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తి చెయ్యాలని పట్టుదలగా ఉన్నారు క్రిష్. అయితే.. పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయాల్లో బిజీ అయ్యారు. దీంతో ఆగస్టులోపు షూటింగ్ పూర్తి అవుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. అందుకనే.. ద‌స‌రాకి వీర‌మ‌ల్లు రావ‌డం క‌ష్ట‌మే అంటున్నారు సినీ జ‌నాలు.

ద‌స‌రాకి రావ‌డం కుద‌ర‌క‌పోతే.. 2023 సంక్రాంతికి విడుదల అవుతుందేమో అనే టాక్ వినిపిస్తోంది. అయితే, విడుదల తేదీ అనేది షూటింగ్ పూర్తి అవ్వడాన్ని బట్టి ఉంటుంది. ప్లాన్ చేసినట్లు ఈ సినిమా ఆగస్ట్ లోపే పూర్తి అయితే… దసరా బరిలో ఉంటుంది హరి హర వీరమల్లు. ఒకవేళ షూటింగ్ లో ఆల‌స్యం జ‌రిగితే.. సంక్రాంతికి ఫిక్స్ చేసుకోవచ్చు. స‌మ్మ‌ర్ త‌ర్వాత క్లారిటీ వ‌స్తుందని స‌మాచారం.

Also Read : 3 గెట‌ప్స్.. 30 థీమ్ డ్రెస్సుల్లో వీర‌మ‌ల్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్