Thursday, March 28, 2024
HomeTrending Newsఇది సమంజసం కాదు: యుటిఎఫ్ ఆందోళనపై బొత్స

ఇది సమంజసం కాదు: యుటిఎఫ్ ఆందోళనపై బొత్స

Bosta on CPS agitation: సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని, ఆ కమిటీ నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కమిటీ అన్ని అంశాలనూ అధ్యయనం చేస్తుందన్నారు.  ఈ విషయమై రేపు ఓ సమావేశం కూడా నిర్వహిస్తున్నామన్నారు.

సీపీఎస్ రద్దు కోరుతూ యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాద్యాయ సంఘాలు నేడు సిఎంవో ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి భారీ ర్యాలీగా సిఎంవోకు వెళ్ళాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించారు. అయితే  విజయవాడ చేరుకుంటున్న ఉపాధ్యాయులను మార్గ మధ్యంలోనే పోలీసులు అడ్డుకుంటున్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ వద్ద పోలీసులు నిఘా  పెట్టారు.  తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద పోలీసులకు, ఉపాధ్యాయులకు మధ్య తోపులాట జరిగింది. రామతీర్థంలో కోదందరాముడి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న బొత్స ఈ  ఆందోళనలపై  స్పందించారు.

ఈ అంశంలో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని, ప్రభుత్వం దీనిపై సానుకూలంగా ఉన్నా సరే ఆందోళనలకు పిలుపు ఇవ్వడం ఏమిటని, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామనడం ధర్మమేనా అని బొత్స ప్రశ్నించారు.  శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడడం ప్రభుత్వ బాధ్యత అని  స్పష్టం చేశారు.  ప్రభుత్వం ప్రతి అంశాన్నీ సానుకూలంగా, మానవతా దృక్పథంతో పరిశీలిస్తోందని, అయినా సరే ఇలా ఆందోళనలకు పిలుపు ఇవ్వడం సరికాదన్నారు.  ఉద్యమం సందర్భంగా జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని, అప్పుడు ప్రభుత్వం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్