Monday, May 20, 2024
Homeసినిమాస‌లార్ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

స‌లార్ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

Valley: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో భారీ పాన్ ఇండియా మూవీ స‌లార్ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన‌ప్ప‌టి నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కేజీఎఫ్ 2 సంచ‌ల‌నం సృష్టించ‌డంతో స‌లార్ పై అంచ‌నాలు ఆకాశాన్ని తాకాయ‌ని చెప్ప‌చ్చు. ఈ మూవీ టీజ‌ర్ ను మే నెల‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం ఓ లోయలో జరుగుతుందని.. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ విజువల్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. లోయ లోపల చేసే ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటాయ‌ట‌. ఇక ప్రీ క్లైమాక్స్ అయితే.. హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంద‌ట‌. ఈ ఎపిసోడ్ కోసం ఏకంగా 20 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నార‌ట‌. త్వ‌ర‌లో ప్ర‌భాస్, శృతిహాస‌న్ పై కీల‌క సన్నివేశాలను చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. వ‌చ్చే సంవ‌త్స‌రం స‌మ్మ‌ర్ లో స‌లార్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Also Read :  స‌లార్ పిక్స్ లీక్ – సోష‌ల్ మీడియాలో వైర‌ల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్