Wednesday, June 17, 2026
HomeసినిమాHari Hara Veera Mallu: వీరమల్లు లేటెస్ట్ షెడ్యూల్ ఎప్పుడు..?

Hari Hara Veera Mallu: వీరమల్లు లేటెస్ట్ షెడ్యూల్ ఎప్పుడు..?

పవన్ కళ్యాణ్‌ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత భీమ్లా నాయక్ చేశారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలన్నింటి కంటే ముందుగా ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు జంటగా నిథి అగర్వాల్ నటిస్తుంది.

అయితే.. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల షూటింగ్స్ జరుగుతుండడంతో వీరమల్లు షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు బ్రేక్ పడడమే కాదు.. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడుతూనే ఉంది. ఒకానొక దశలో ఈ సినిమా ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. సమ్మర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ.. షూటింగ్ పూర్తి కాకపోవడంతో విడుదల కావడం లేదు. ఆతర్వాత దసరాకి వీరమల్లు రావడం ఖాయం అనే టాక్ వినిపించింది. ఇప్పుడు షూటింగ్ ఆలస్యం అవ్వడంతో దసరాకి కూడా వస్తుందని నమ్మకం లేదు. దీంతో వీరమల్లు సినిమాకి ఏమైంది..? అసలు వస్తుందా ..? అనే అనుమానం అభిమానుల్లో ఎక్కువుగా ఉంది.

తాజా వార్త ఏంటంటే… ఈ నెల 13వ తేదీ నుంచి హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ ప్రారంభించనున్నారని సమాచారం. సారధి స్టూడియోలో కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్‌ పై చిత్రీకరించే ఈ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని.. ఈ ఎపిసోడ్ చిత్రీకరణతో చాలా వరకు షూటింగ్ పూర్తవుతుందని తెలిసింది. మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మరి.. దసరాకి వస్తుందో.. సంక్రాంతికి వస్తుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular