Friday, June 12, 2026
Homeసినిమావీరమల్లు మూవీకి మళ్లీ బ్రేక్ పడిందా..?

వీరమల్లు మూవీకి మళ్లీ బ్రేక్ పడిందా..?

పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ మూవీని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఇందులో నిధి అగర్వాల్ పవన్ కు జంటగా నటిస్తుంది. ఈ మూవీ ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఇప్పటికీ అలా షూటింగ్ జరుపుకుంటునే ఉంది. ఈ సినిమా తర్వాత స్టార్ట్ చేసిన ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అయిపోవడం కూడా జరిగింది కానీ.. వీరమల్లు మాత్రం ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది.

ఇటీవల వీరమల్లు షూటింగ్ కోసం డేట్స్ ఇచ్చారు. రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరిగింది. పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే.. ఇంకా ఈ సినిమా షూట్ నలభై రోజులు పాటు జరగాల్సి ఉంది. రానున్న రెండు నెలల పాటు ఈ సినిమాకి పవన్ డేట్స్ ఇవ్వలేదని సమాచారం. వేరే సినిమాల షెడ్యూల్స్ కారణంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూట్ కి గ్యాప్ ఇచ్చారు. దాంతో.. ఈ సినిమా షూట్ కి మళ్లీ బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఇంటర్వెల్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి సంబంధించి ఈ ఇంటర్వెల్ లో ఓ ట్విస్ట్ రివీల్ అవుతుందని, ఈ ట్విస్ట్ సినిమా మొత్తంలోనే హైలైట్ గా నిలుస్తోందని సమాచారం.

అలాగే పవన్ పాత్ర ఈ సీక్వెన్స్ నుంచి వేరే వెరియేషన్ కి టర్న్ తీసుకుంటుందట. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీస్తుండడంతో భారీ బడ్జెట్ అవుతుంది. ఇప్పుడు బాగా ఆలస్యం అవ్వడంతో మరింతగా బడ్జెట్ పెరుగుతుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పుడు షూటింగ్ కి మళ్లీ బ్రేక్ పడడంతో సమ్మర్ లో రావాల్సిన వీరమల్లు దసరాకి వస్తుంది అంటున్నారు. మరి.. దసరాకి అయినా వీరమల్లు వస్తుందో.. లేదో..?

Also Read : వీరమల్లు టార్గెట్ రీచ్ అవుతాడా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular