Wednesday, June 17, 2026
Homeసినిమా'వీరమల్లు' టీజర్ రెడీ, రిలీజ్ ఎప్పుడంటే?

‘వీరమల్లు’ టీజర్ రెడీ, రిలీజ్ ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ ‘హరి హర వీరమల్లు‘.  క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్  కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది. ఇది పవన్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కు అనూహ్య స్పందన లభించింది.

ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ కావాల్సిన ఈ మూవీ కరోనా,  పవన్ పాలిటిక్స్ లో బిజీ కారణంగా ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి క్రిష్ ప్రయత్నిస్తున్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణం బాగా ఆలస్యం అవ్వడంతో పవర్ స్టార్ ఈ మూవీని కంప్లీట్ చేసిన తర్వాతే వేరే సినిమా చేస్తానని మాట ఇచ్చారట. చెప్పినట్టుగానే వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను డిసెంబర్ 31, 2022 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే రోజున పవర్ స్టార్ ఖుషీ సినిమా రీ రిలీజ్ కానుంది. అయితే.. ఈ ఖుషీ చిత్రంతో పాటుగా వీరమల్లు మేకర్స్ గ్లింప్స్ ను విడుదల చేసే ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక వీరమల్లు చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మర్ కి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular