Tuesday, June 9, 2026
Homeసినిమాత్వరలో సెట్స్ పైకి ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’

త్వరలో సెట్స్ పైకి ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’

Going for Sets: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ పిరియాడిక్ మూవీ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. ఈ చిత్రాన్ని సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం.ర‌త్నం నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మూవీలో ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపుగా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కావాల్సింది కానీ.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

అలాగే ప‌వ‌ర్ స్టార్ ఈ సినిమా క‌న్నా ముందుగా ‘భీమ్లా నాయ‌క్’కి డేట్స్ ఇవ్వ‌డం వ‌ల‌న కూడా హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ఆల‌స్యం అయ్యింది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఈ చిత్రం తాజా షెడ్యూల్ ను ఏప్రిల్ 6 నుంచి మొదలుపెట్ట‌నున్న‌ట్టుగా టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ షెడ్యూల్ కోసం హైద‌రాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో భారీ సెట్స్ రూపొందించారని స‌మాచారం.

తాజా షెడ్యూల్ లో.. సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ భారీ, క్రేజీ చిత్రాన్ని ద‌స‌రాకి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లో అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Also Read : పవన్ ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన క్రిష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular