Wednesday, March 11, 2026
Homeసినిమాపవన్ ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన క్రిష్

పవన్ ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన క్రిష్

పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. ఇందులో నిధి అగర్వాల్ నాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌ పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా క్రిష్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఇంతకీ ఎప్పుడు రిలీజ్ చేయనున్నారంటే.. ఈ పాన్ ఇండియా మూవీని 2022 ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టుగా గతంలో అనౌన్స్ చేశారు. అయితే.. సంక్రాంతికి ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అవుతుంది. ఆతర్వాత సమ్మర్ లో ‘హరి హర వీరమల్లు’ గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌ని ఉన్న‌త‌స్థాయి నిర్మాణ విలువ‌ల‌తో 150 కోట్లకు పైగా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్‌-ఇండియా. అందుచేత అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.

ఇప్పటి వరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ యాభై శాతం పూర్త‌యింది. త్వరలో తాజా షెడ్యూల్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అగ్ర‌శ్రేణి సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి సంగీత బాణీలు అందిస్తుండ‌గా, పేరు పొందిన సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధ‌వ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular