తెలంగాణ ప్రభుత్వం హయాంలో నారాయణ ఖేడ్ దశదిశ మారుతున్నదని ఆర్థిక శాఖమంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో వెనుకబడిన ప్రాంతంగా పేరున్న నారాయణ ఖేడ్ ..టీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. నారాయణ ఖేడ్ లో 70 ఏళ్ల లో పరిష్కారం కానీ సమస్యలు సీఎం కేసీఆర్ చొరవతో 7 ఏళ్ల లో పరిష్కారం అయ్యాయన్నారు. నారాయణ ఖేడ్ లో జరిగిన నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుండి గోదావరి జలాలను తీసుకువచ్చి సింగూర్ ప్రాజెక్టు కు అనుసంధానం చేసి…సింగూర్ బాక్ వాటర్ నుండి బసవేశ్వర,సంగమేశ్వర ప్రాజెక్ట్ ద్వార సాగునీరు ఇవ్వబోతున్నామని మంత్రి తెలిపారు. 1074 కోట్లతో బసవేశ్వర ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయబోతున్నరని, సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 21తేదీన శంకుస్థాపన చేయబోతున్నామని వెల్లడించారు.
నారాయణ ఖేడ్ అంటేనే రాళ్లు, రప్పలు, కొండలతో నిరుపయోగంగా ఉండేది…కానీ బసవేశ్వర ప్రాజెక్టుతో నారాయణ ఖేడ్ నియోజకవర్గమ్ లో లక్ష 37 వేల ఎకరాలకు సాగునీటి ఇస్తామని, బసవేశ్వర ప్రాజెక్టు నిర్మాణం తర్వాత నారాయణ ఖేడ్ ప్రాంతం కాశ్మీర్ లోయగా మారుతుందన్నారు. నియోజకవర్గమ్ లోని అన్ని మండలాలు గోదావరి నీళ్లతో సస్యశ్యామలం కాబోతున్నాయని, ఈ నెల 21న జరిగే సీఎం సభకు లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చి ఘన స్వాగతం పలకలని మంత్రి పిలుపు ఇచ్చారు.
అంతకు ముందు మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా నారాయణ్ ఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదానం చేశారు.
Also Read : దమ్ముంటే జైల్లో పెట్టండి..కెసిఆర్ సవాల్