Saturday, July 27, 2024
HomeTrending Newsఅస్సాం సీఎంను బర్తరఫ్ చేయాలి - కాంగ్రెస్

అస్సాం సీఎంను బర్తరఫ్ చేయాలి – కాంగ్రెస్

Assam Cm : అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మను వెంటనే సిఎం పదవి నుండి బర్తరఫ్ చేయాలని, కాంగ్రెస్ నాయకుల అరెస్టు అప్రజాస్వామికమని మాజీ మంత్రి,కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అస్సాం సీఎంపై కేసు నమోదు చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్ది నాయకత్వంలో జిల్లా ఎస్పీ కార్యాలయo ముట్టడికి పిలుపునివ్వడంతో బుధవారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించారు. జిల్లాలోని కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి బుగ్గారం, సారంగాపూర్, బిర్పూర్, జగిత్యాల, కోరుట్ల తదితర పోలీసు స్టేషన్లకు తరలించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు బయటకు వెళ్ళానియకుండా గృహణిర్బంధం చేయగా,కాంగ్రెస్ ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగాఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ అస్సాం సీఎం ఎంపీ రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజుల క్రితం అస్సాం సీఎం పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ పోలీసు, జిల్లాలోని పలు పోలీస్ స్టేషనలో పిర్యాదు చేసినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. అస్సాం సీఎంను పదవి నుండి బర్తరఫ్ చేయకుండా బిజెపి నాయకత్వం ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లుగా భావించాల్సిన పరిస్థితి ఉందని మండిపడ్డారు.

అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతాపార్టీ సమర్థిస్తుందా..? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా బిజెపి నాయకత్వం స్పందించి అస్సాం సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు శాంతియుతంగా నిరసన చేపట్టడానికి కూడా అనుమతి లేదాని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామీకని జీవన్ రెడ్ది అన్నారు. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి జగిత్యాల పోలీస్ స్టేషన్ కు తరలించగా వారిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్టేషన్ కు వెళ్లి పరామర్శించారు. అరెస్టయినవారిలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మునిసిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కల్లెపల్లి దుర్గయ్య, కౌన్సిలర్ నక్క జీవన్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిరాజుద్దీన్ మన్సూర్,రాష్ట్ర నేత బండ శంకర్, కచ్చు హరీష్, జి ల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా మధు, నాయకులు గాజుల రాజేందర్, కొప్పేరా వెంకట్ రెడ్ది,నేహాల్, రియాజ్,బీరం రాజేష్,పాషా,మున్నా,అజహార్,రజినీకాంత్,నదిమ్ అర్బబ్ తదితరులున్నారు.

Also Read : సీఎం పదవికి హేమంత అనర్హుడు – జీవన్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్