Saturday, January 18, 2025
Homeసినిమాబ‌న్నీని డైరెక్ట్ చేస్తున్న హ‌రీష్ శంక‌ర్

బ‌న్నీని డైరెక్ట్ చేస్తున్న హ‌రీష్ శంక‌ర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా స‌క్సెస్ త‌ర్వాత అల్లు అర్జున్ మొన్నటి వరకు విదేశాల్లో విహార యాత్ర చేసి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఫారిన్ వెళ్ళాడు. అయితే.. ఈసారి షూటింగ్ కోసం వెళ్లాడు. అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే ఒక యాడ్ చిత్రీకరణ విదేశాల్లో జరగనుంది. ఈ యాడ్ ని గబ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ హరీష్ శంకర్ తీస్తున్నారు.

బన్ని, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఇంతకు ముందు డీజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ అనే చిత్రం వచ్చింది. ఆ సినిమా నుంచి వారి బంధం బలపడింది. ఈ యాడ్ ని ముంబైకి చెందిన టీమ్ ని తీస్తోంది. కానీ.. బన్నీ పట్టుబట్టి హరీష్ ని డైరెక్టర్ గా తీసుకున్నారు. హరీష్ పర్యవేక్షణలో ఆ టీం ఈ యాడ్ ని చిత్రీకరిస్తుంది. పుష్ప సినిమా తర్వాత  బన్నీ రేంజ్ మారిపోయింది. కార్పొరేట్ కంపెనీలు కూడా అల్లు అర్జున్ పై ఎక్కువ ఖర్చు పెట్టి యాడ్స్ తీస్తున్నాయి.

ఇక పుష్ప 2 విష‌యానికి వ‌స్తే… ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. స్క్రిప్ట్ వ‌ర్క్ కంప్లీట్ అయ్యింది. వచ్చేనెలలో కానీ, సెప్టెంబర్ లో కానీ పుష్ప 2 షూటింగ్ మొదలవుతుంది. అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా పుష్ప 2 ఉంటుంద‌ని.. ఖ‌చ్చితంగా పుష్ప 2 సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంద‌ని టీమ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో చెబుతున్నారు. అలాగే బ‌న్నీ.. హ‌రీష్ శంక‌ర్ తో ఓ మూవీ కూడా చేస్తాడ‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి… పుష్ప 2 త‌ర్వాత బ‌న్నీ, హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ సెట్ అవుతుందేమో చూడాలి.

Also Read : కష్టాన్ని ఇష్టపడటమే అల్లు అర్జున్ స్పెషాలిటీ!

RELATED ARTICLES

Most Popular

న్యూస్