Sunday, May 19, 2024
Homeసినిమాప‌వ‌న్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన హ‌రీష్ శంక‌ర్

ప‌వ‌న్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన హ‌రీష్ శంక‌ర్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్లో ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్’ అనే సినిమాను ప్ర‌క‌టించి చాన్నాళ్లు అయ్యింది. ఇందులో ప‌వ‌న్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించ‌నున్న‌ట్టుగా గ‌తంలో ప్ర‌క‌టించారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా సెట్స్ పైకి రాలేదు. ఎప్పుడు సెట్స్ పైకి వ‌స్తుందో క్లారిటీ లేదు. దీంతో అస‌లు భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమా ఉందా..?  లేదా..? అనేది ఆస‌క్తిగా మారింది.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు‘ సినిమాకి డేట్స్ ఇచ్చారు. త్వ‌ర‌లో ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ మూవీ త‌ర్వాత ‘వినోద‌య సీతం’ అనే మూవీ రీమేక్ లో న‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి స‌ముద్రఖ‌ని డైరెక్ష‌న్ చేయ‌నున్నారు. దీంతో ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్’ ఇక ఇప్ప‌ట్లో లేన‌ట్టే అని.. హ‌రీస్ శంక‌ర్ మ‌రో హీరోతో మూవీ ప్లాన్ చేస్తున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఇదిలా ఉంటే.. క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే పుట్టిన‌రోజు సంద‌ర్భంగా హ‌రీష్ శంక‌ర్ స్పందిస్తూ… తనకు ఎంతో ఇష్టమైన నటీమణి పూజా హెగ్డేకి హ్యాపీ బర్త్ డే అంటూ పోస్ట్ పెట్టిన హరీష్, త్వరలో మీతో కలిసి సెట్స్ లో వర్క్ చేసేందుకు ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపారు. దీంతో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ మూవీ త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లనుంద‌ని పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ డైరెక్టర్ హరీష్ కి సోషల్ మీడియాలో థాంక్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి.. ప‌వ‌న్ భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ ని సెట్స్ పైకి తీసుకెళ‌తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్