Friday, March 13, 2026
Homeసినిమాస‌ల్మాన్ తో హ‌రీష్ శంక‌ర్ మూవీ?

స‌ల్మాన్ తో హ‌రీష్ శంక‌ర్ మూవీ?

Salman-Harish: షాక్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌య‌మై ‘మిర‌ప‌కాయ్’ తో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించి.. ‘గ‌బ్బ‌ర్ సింగ్’తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్’ అనే సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాని ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్లలేదు. త్వ‌ర‌లో ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల హ‌రీష్ శంక‌ర్.. బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల‌ పోస్ట్ చేశారు. అప్ప‌టి నుంచి స‌ల్మాన్, హ‌రీష్ శంక‌ర్ ఎందుకు క‌లిశారు అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. వీరిద్ద‌రూ సినిమా చేయ‌డం కోస‌మే క‌లిశార‌ని..ఈ క్రేజీ కాంబినేష‌న్లో మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న వార్త వాస్త‌వ‌మేనా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది.

Also Read : హ‌రీష్ శంక‌ర్ కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన మెగాస్టార్.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular