Monday, June 8, 2026
Homeసినిమారామ్ తో హరీష్ శంకర్ మూవీ ఫిక్స్ అయ్యిందా?

రామ్ తో హరీష్ శంకర్ మూవీ ఫిక్స్ అయ్యిందా?

Ram-Shankar:  ఎన‌ర్జిటిక్ హీరో రామ్ ‘ఇస్మార్ట్ శంక‌ర్’ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. ‘రెడ్’ తో మరో స‌క్సెస్ సాధించిన రామ్ ఇప్పుడు ‘వారియ‌ర్’ అనే భారీ చిత్రం చేస్తున్నారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దీని త‌ర్వాత ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. త్వ‌ర‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది.

అయితే.. ఇప్పుడు రామ్.. ప‌వ‌ర్ స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ తో ఓ భారీ చిత్రం చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రామ్ ఎనర్జీని దృష్టిలో పెట్టుకుని కమర్శియల్ అంశాలతో అదిరిపోయే స్క్రిప్టును హరీష్ శంకర్ రెడీ చేస్తున్నార‌ట‌. ఇటీవలే వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.

ప్రస్తుతం హరీష్ శంకర్ పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  తో భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని చేయ‌నున్నారు. అలాగే  రామ్ తో బోయపాటి చిత్రాన్ని పూర్తి  చేయల్సి ఉంది. ఈ రెండు ఏడాది చివరికల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. అటు పై రిలీజ్ వచ్చే ఏడాది ఉండొచ్చు. ఆ లెక్కన సినిమా వచ్చే ఏడాది మిడ్ లో రామ్, హ‌రీష్ శంక‌ర్ మూవీ ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. త్వ‌ర‌లో అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular