Sunday, June 14, 2026
Homeసినిమాస్పీడు పెంచిన పవర్ స్టార్ డైరెక్టర్

స్పీడు పెంచిన పవర్ స్టార్ డైరెక్టర్

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమాను ప్రకటించిన చాలా రోజుల వరకు ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ లేదనుకున్నారు. అయితే.. ఇటీవల భవదీయుడు భగత్ సింగ్ కాస్తా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ అయ్యిందని ప్రకటించారు. అంతే కాకుండా ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ మూవీని ప్రారంభించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఉందనే క్లారిటీ వచ్చింది కానీ.. పవర్ స్టార్ పాలిటికల్ గా బిజీగా ఉండడంతో ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో క్లారిటీ లేదు.

పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో.. హరీష్ శంకర్ ను అప్ డేట్ ఎప్పుడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు అన్ని సందేహాలకు చెక్ పెడుతూ అధికారికంగా సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. తాజాగా #ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ-ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది.. అంటూ కబురు అందించారు హరీష్ అండ్ టీమ్ సభ్యులు. ఆ మేరకు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ట్విట్టర్ లో ఓ ఫోటోని షేర్ చేసి వివరాలు వెల్లడించింది. ఈ ఫోటోగ్రాఫ్ లో తన టీమ్ తో డిస్కస్ చేస్తూ హరీష్ చాలా జోష్ లో కనిపిస్తున్నాడు.

పవన్ స్నేహితుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి.. తో కలిసి స్క్రిప్టుకి అనువైన సెట్స్ వగైరా అంశాలను చర్చిస్తున్నట్టుగా ఉంది. ఈ సినిమాని భారీ కాన్వాస్ పై తెరకెక్కించేందుకు టీమ్ ప్రిపరేషన్  లో ఉంది. టైటిల్ కి తగ్గట్టు మాంచి మాస్ మసాలా యాక్షన్ సినిమాకి దేశభక్తిని జోడించి ఈ సినిమాని హరీష్ తెరకెక్కిస్తాడా?  లేకపోతే పాన్ ఇండియా ట్రెండ్ ని దృష్టిలో ఉంచుకుని యూనివర్శల్ యాక్సెప్టెన్సీ ఉన్న యూనిక్ కంటెంట్ ని ఎంచుకున్నాడా? అనేది ఆసక్తిగా మారింది. గబ్బర్ సింగ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి.. పవర్ స్టార్ అభిమానుల అంచనాలను ఎంత వరకు అందుకుంటాడో చూడాలి.

Also Read:  పవన్, హరీష్ శంకర్ మూవీ హీరోయిన్ ఎవరో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular