Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: హర్యానా, పాట్నా విజయం  

ప్రొ కబడ్డీ: హర్యానా, పాట్నా విజయం  

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ ల్లో తమిళ్ తలైవాస్ పై హర్యానా స్టీలర్స్, యూ ముంబా పై పాట్నా పైరేట్స్ విజయం సాధించాయి.

హర్యానా స్టీలర్స్ – తమిల్ తలైవాస్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో 37-29తో హర్యానా గెలుపొందింది. ఆట మొదటి భాగంలో 15-12తో పైచేయి సాధించిన హర్యానా రెండోభాగంలోనూ అదే జోరు కొనసాగించి 22-17తో ముందంజలో నిలిచింది. మ్యాచ్ సమయం ముగిసేనాటికి 8 పాయింట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. హర్యానా రైడర్ ఆశిష్ 16; కెప్టెన్ వికాస్ ఖండాలా 8 పాయింట్లు సాధించి విజయంలో  కీలక పాత్ర పోషించారు.

పాట్నా పైరేట్స్ – యూ ముంబా జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 47-36తో పాట్నా విజయం సాధించింది. ప్రథమార్ధంలో 26-18తో మంచి ఆధిక్యం చూపిన పైరేట్స్ ద్వితీయార్ధంలోనూ తమ దూకుడు కొనసాగించి 21-18 తో పైచేయి ప్రదర్శించారు. చివరకు 9 పాయింట్లతో గెలిచారు. పాట్నా రైడర్లు సచిన్ -16; గుమన్ సింగ్ 11 పాయింట్లతో సత్తా చాటి జట్టు విజయానికి దోహదపడ్డారు.

టి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… పాట్నా పైరేట్స్ (65 పాయింట్లు); హర్యానా స్టీలర్స్(58); దబాంగ్ ఢిల్లీ (57); బెంగుళూరు బుల్స్ (55);   జైపూర్ పింక్ పాంథర్స్ (51); యూ ముంబా (48) టాప్ సిక్స్ లో ఉన్నాయి.

Also Read: కబడ్డీ: జైపూర్ విన్, బెంగాల్-తెలుగు మ్యాచ్ టై

RELATED ARTICLES

Most Popular

న్యూస్