Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: హర్యానా, పాట్నా విజయం- మరో మ్యాచ్ టై

ప్రొ కబడ్డీ: హర్యానా, పాట్నా విజయం- మరో మ్యాచ్ టై

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మూడు మ్యాచ్ ల్లో హర్యానా, పాట్నా విజయం సాధించగా, ఢిల్లీ-బెంగుళూరు మ్యాచ్ టై గా ముగిసింది.

హర్యానా స్టీలర్స్ – బెంగాల్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 46-29తో హర్యానా గెలుపొందింది. తొలి అర్ధ భాగంలో 19-19తో రెండు జట్లూ సమంగా నిలిచాయి. రెండో భాగంలో  హర్యానా దూకుడు ప్రదర్శించి 27-10 తో భారీ ఆధిక్యం సంపాదించింది. దీనితో సమయం పూర్తయ్యే నాటికి హర్యానా 17 పాయింట్లతో ఘనవిజయం సాధించింది. హర్యానా జట్టులో వికాస్ ఖండాలా-10; వినయ్-8; ఆశిష్-6 పాయింట్లతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు. బెంగాల్ కెప్టెన్ మనీందర్ సింగ్ 13  పాయింట్లు సాధించడం విశేషం.

దబాంగ్ ఢిల్లీ- బెంగుళూరు బుల్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 36-36తో టై  అయ్యింది. తొలి అర్ధ భాగంలో ఢిల్లీ 18-14తో ఆధిక్యం ప్రదర్శించింది. ద్వితీయార్ధంలో బెంగుళూరు రాణించి 22-18 తో పైచేయి సాధించింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లూ చెరో 36 పాయింట్లు సాధించారు. బెంగుళూరు కెప్టెన్ పవన్ షెరావత్ మరోసారి తన సత్తా ప్రదర్శించి 13 పాయింట్లు రాబట్టాడు. ఢిల్లీ కెప్టెన్ నవీన్ కుమార్ కూడా 13 పాయింట్లతో రాణించారు.

పాట్నా పైరేట్స్  – గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్ లో 43-23తో పాట్నా విజయ దుందుభి మోగించింది. తొలి అర్ధ భాగంలో 18-16తో స్వల్ప ఆధిక్యంలో ఉన్న పాట్నా రెండో భాగంలో తమ సత్తా ప్రదర్శించి 25-7తో గుజరాత్ పై భారీ పైచేయి ప్రదర్శించింది. మ్యాచ్ ముగిసే సమయానికి 20 పాయింట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… దబాంగ్ ఢిల్లీ (57 పాయింట్లు); పాట్నా పైరేట్స్ (50); బెంగుళూరు బుల్స్ (54);  హర్యానా స్టీలర్స్ (48); జైపూర్ పింక్ పాంథర్స్ (45);  తమిల్ తలైవాస్ (44) టాప్ సిక్స్ లో ఉన్నాయి.

Also Read : ప్రొ కబడ్డీ: జైపూర్, తమిళ్ తలైవాస్  విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్