Wednesday, March 18, 2026
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ:  హర్యానా- తెలుగు టైటాన్స్ మ్యాచ్ టై   

ప్రొ కబడ్డీ:  హర్యానా- తెలుగు టైటాన్స్ మ్యాచ్ టై   

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో హర్యానా స్టీలర్స్ – తెలుగు టైటాన్స్ మధ్య నేడు జరిగిన మ్యాచ్ 39-39తో డ్రా గా ముగిసింది. తొలి అర్ధ భాగంలో 20-19తో  హర్యానా స్వల్ప ఆధిక్యం సంపాదించింది. రెండో అర్ధభాగంలో టైటాన్స్ 20-19తో పైచేయి సాధించింది. దీనితో మ్యాచ్ ముగిసే నాటికి  చెరో 39 పాయింట్లు సాధించారు. హర్యానా కెప్టెన్ వికాస్ కండాలా, తెలుగు టైటాన్స్ ఆటగాడు అంకిత్ బేనీవాల్  చెరో పది పాయింట్లు సాధించారు.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… బెంగుళూరు బుల్స్ (46 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (43); హర్యానా స్టీలర్స్ (42); బెంగాల్ వారియర్స్ (41); పాట్నా పైరేట్స్ (40); యూపీ యోధ (39); జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular