Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్T20 Match: టిక్కెట్ల కోసం తొక్కిసలాట

T20 Match: టిక్కెట్ల కోసం తొక్కిసలాట

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో  క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల కోసం తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. వచ్చే ఆదివారం హైదరాబాద్ లో జరగబోయే ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య టి 20మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి  జింఖానా గ్రౌండ్స్ లో టిక్కెట్లు విక్రయిస్తామని హెచ్ సిఏ అధికారులు ప్రకటించారు. నిన్నటి నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకొని రాత్రి అంతా క్యూలో నిలబడ్డారు.  నేటి ఉదయం పది గంటలకు సేల్స్ ప్రారంభం కావాల్సి ఉండగా అరగంట ఆలస్యంగా టర్ ఓపెన్ చేసి పది నిమిషాల్లోనే టికెట్లు అయిపోయినట్లు ప్రకటించారు.

దీనితో ఒక్కసారిగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ  కౌంటర్ వైపు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగి పలువురు గాయపడ్డారు.

ఈ వ్యవహారంపై తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. మధ్యాహ్నం  అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి హాజరు కావాల్సిందిగా హెచ్ సిఏ అధ్యక్ష కార్యదర్శులను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్