టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించి భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన నీరజ్ చోప్రా, భారత మహిళా టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఖేల్ రత్న అందుకున్నారు. జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్ లో వైభవంగా జరిగింది. రాష్ట్రపతి గౌరవ రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారికి ఇచ్చే రాజీవ్ ఖేల్ రత్న తో పాటు అర్జున అవార్డు, కోచ్ లకు అందజేసే ద్రోణాచార్య అవార్డుల ప్రదానం జరిగింది.
నీరజ్ చోప్రా, మిథాలీ రాజ్, రెజ్లర్ రవి కుమార్ దాహియా, బాక్సింగ్ క్రీడాకారిణి లవ్లీనా, హాకీ ఆటగాడు శ్రీజేష్, ఫుట్ బాల్ ప్లేయర్ సునీల్ చెత్రీ, భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్, పారా ఒలింపిక్స్ లో పతకాలు అందించిన షూటర్ అవని లేఖరా, సుమిత్ ఆంటిల్, ప్రమోద్ భగత్, కృష్ణ నగార్, మనీష్ నర్వాల్ లను ఖేల్ రత్న అందజేశారు. క్రికెటర్ శిఖర్ ధావన్ కు అర్జున అవార్డు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు, పలు కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.