Sunday, February 23, 2025
HomeTrending Newsజనసంద్రంగా మారిన పల్నాడు రోడ్లు

జనసంద్రంగా మారిన పల్నాడు రోడ్లు

పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ బస్సుయాత్రకు ప్రజలు నీరాజనం పలికారు. ఈ ఉదయం  గంటావారిపాలెం బస ప్రాంతం నుంచి ఉదయం బస్సు యాత్ర మొదలైనప్పటి నుంచి రోడ్డు పొడవునా లో జన ప్రభంజనం కనిపించింది.  గంటావారిపాలెం నుంచి మేమంతా సిద్ధం బహిరంగసభ జరిగే పిడుగురాళ్ల వరకు సుదీర్ఘంగా సాగిన జగన్ రోడ్ షో లో దారిపొడవునా అభిమానులు, కార్యకర్తలు అనుసరించారు.

సంతమాగులూరు అడ్డురోడ్డు, అన్నవరప్పాడు, రొంపిచెర్ల, సంతగుడిపాడు, విప్పెర్ల, నకరికల్లు, పిడుగురాళ్ల మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లోనూ రోడ్లపైకి వచ్చి జన బారులు తీరారు. బస్సు టాప్‌పై నుంచి అభివాదం చేయడంతో పాటు పలుచోట్ల… బస్సుదిగి నేరుగా అవ్వాతాతలను, అక్కచెల్లెమ్మలను, విద్యార్ధులతోనూ ముచ్చటించి వారి యోగక్షేమాలను తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ పథకాలు అందాయా ? లేదా? మీ ఇంటికి చేరాయా? లేదా ? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్