Friday, March 29, 2024
HomeTrending Newsపెన్నా నదికి భారీ వరద నీరు

పెన్నా నదికి భారీ వరద నీరు

మండోస్ తుఫాను ధాటికి పెన్నానదికి భారీ వరద చేరింది. దీనితో పెన్నా పరివాహక ప్రజలు భయం గుప్పెట్లో  ఉన్నారు. మైలవరం నుంచి పెన్నానదికి 2  వేల క్యూసెక్కుల నీరు విడుదలైంది.  సాయంత్రంలోగా 4 వేల క్యూసెక్కుల నీరు విడుదల అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.  పెన్నా పరివాహక ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  గండికోట నుంచి మైలవరానికి 4 వేల క్యూసెక్కులు విడుదలయ్యింది.  గండికోటలో 26.4 టీఎంసీలు, మైలవరంలో 6 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

మరోవైపు  మాండూస్ ధాటికి సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం దగ్గర సముద్రంలో మరబోటు చిక్కుకుంది. బోటులో ఏడుగురు మత్యకారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని  కాపాడేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. తుఫాన్‌ తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్