Thursday, March 12, 2026
Homeస్పోర్ట్స్IPL-2023 Final:  అహ్మదాబాద్ లో భారీ వర్షం: మ్యాచ్ వాయిదా

IPL-2023 Final:  అహ్మదాబాద్ లో భారీ వర్షం: మ్యాచ్ వాయిదా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వు డే అయిన సోమవారం నాటికి వాయిదా పడింది. కాలేదు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా మధ్యాహ్నం నుంచే నగరంలో భారీ వర్షం కురిసింది. గ్రౌండ్ ను కవర్లతో కప్పి ఉంచారు. కొద్దిసేపు తెరిపిచ్చిన వాన మళ్ళీ ఉధృతంగా పడింది. దీనితో మ్యాచ్ ను ఆదివారం కొనసాగించే నేడు మొదలుపెట్టే అవకాశాలు లేవు.  ఆదివారం రాత్రి  10.54గంటల ప్రాంతంలో అంపైర్ల తో పాటు మ్యాచ్ రెఫరీ, ఇరు జట్ల ప్రధాన కోచ్ లు సమావేశమై మ్యాచ్ ను సోమవారానికి వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular