Saturday, November 23, 2024
HomeTrending Newsజంటనగరాల్లో భారీ వర్షం

జంటనగరాల్లో భారీ వర్షం

జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం పడింది. షేక్పేట్, గోల్కొండ, టోలిచౌకి,  మెహదీపట్నం, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, సోమాజిగూడ, కొండాపూర్, రాయదుర్గం, ఖైరతాబాద్, బోయిన్పల్లి, ఆల్వాల్, మారేడ్ పల్లి, తిరుమలగిరి, బేగంపేట, ప్యారడైజ్, చిలకలగూడ, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, భార్కస్ , యాకుత్పురా, బహదూర్ పురా, చేవెళ్ల, నాగారం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచింది. దీంతో జిహెచ్ఎంసి డిఆర్ఎస్ బృందాలను అప్రమత్తం చేసింది.

నైరుతి రుతుపవనాల ఆగమనంతో… వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ మహానగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు. నగరంలో సోమవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ప్రజలు అత్యవసర పని ఉంటే తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు అని ఆమె సూచించారు. అనవసరంగా బయట తిరిగి ఇబ్బందులకు గురి కావద్దని పేర్కొన్నారు. వర్షాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే GHMC ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం నెంబర్ 040-21111111ను సంప్రదించాలని కోరారు.

మణికొండలో వర్షం నీరు రోడ్లపై చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులపాటు హైదరాబాద్ నగరంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షం నమోదయింది. సింగపూర్ టౌన్షిప్ దగ్గర 5.6 సెం.మీ వర్షం నమోదయింది. రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి కింది గాలులు బలంగా వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్