Sunday, January 19, 2025
HomeTrending Newsబ్రెజిల్ లో కుండపోత వర్షాలు.. వందమంది మృతి

బ్రెజిల్ లో కుండపోత వర్షాలు.. వందమంది మృతి

Heavy Rains Brazil : బ్రెజిల్ లో కుండపోత వర్షాలకు సుమారు వంద మంది మృత్యువాత పడ్డారు. రాజధాని రియోడేజనిరో కు ఉత్తరాన పెట్రోపోలిస్ పట్టణం వరదలతో ముంపునకు గురైంది. అర్ధరాత్రి నుంచి వర్షం తీవ్ర రూపం దాల్చటంతో సమీపంలోని పర్వతాలలో కొండ చరియలు విరిగిపడి ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. పర్వతాల నుంచి దిగువకు పెద్ద ఎత్తున బురదగా వస్తున్నా మట్టి లోతట్టు ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలను ముంచెత్తింది. వీటికి తోడు తీవ్ర స్థాయిలో పిడుగులు పడటంతో పెట్రోపోలిస్ లో భయానక వాతావరణం నెలకొంది. సుమారు 80 మంది తీవ్ర గాయాలుకాగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈశాన్య ప్రాంతంలోని సో పులో రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలకు సుమారు 25 మంది మృత్యువాత పడ్డారు. ఈ రాష్ట్రంలో కూడా కొండప్రాంతాలపై  ప్రభావం ఎక్కువగా ఉంది. వారం రోజుల క్రితమే ఈ రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన వర్షాలు తాజాగా మరోసారి ముంచెత్తాయి.

బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. మాస్కో నుంచి వర్షాల ప్రభావం సమీక్షించిన దేశాధ్యక్షుడు వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని మంత్రివర్గ సహచరులను, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. భూమధ్య రేఖ ప్రాంతంలో ఉన్న బ్రెజిల్ దేశంలో ఉరుములు,మెరుపులతో వర్షాలు ప్రతి రోజు పడటం పరిపాటి. అయితే వారం రోజుల నుంచి పడుతున్న వర్షాల ధాటికి కొండప్రాంతాలు తీవ్ర ప్రభావానికి లోనవుతున్నాయి. వాతావరణ మార్పుల వల్లే అమెజాన్ అడవుల్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Also Read : గ్వాటెమాలాలో భూకంపం

RELATED ARTICLES

Most Popular

న్యూస్