Saturday, September 21, 2024
HomeTrending Newsఫిలిప్పీన్స్‌ భారీ వర్షాలు

ఫిలిప్పీన్స్‌ భారీ వర్షాలు

ఫిలిప్పీన్స్‌ లో పడుతున్న వర్షాల ధాటికి దేశంలో ప్రజా జీవనం స్తంభించింది. లుజోన్ ద్వీపంలోని బికాల్ ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలకు విద్యుత్, రవాణా వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. జోరు వానకు వరదలు పోటెత్తడంతో ఇప్పటివరకు 13 మంది మరణించగా, 23 మంది గల్లంతయ్యారు. వర్షాల వల్ల 45 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో అధికారులు వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది.

చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వేడి, చల్లని గాలులు కలిసి భారీ మేఘాలను ఏర్పరచడం వల్ల కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్