Saturday, January 18, 2025
HomeTrending Newsతమిళనాడు, ఏపీల్లో రేపటి నుంచి భారీ వర్షాలు

తమిళనాడు, ఏపీల్లో రేపటి నుంచి భారీ వర్షాలు

Heavy Rains In Tamil Naidu And Andhra Pradesh Tomorrow :

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 10, 11వ తేదీల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం హెచ్చరించింది. ‘ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంపై ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ- వాయవ్య దిశగా కదిలి 11న తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకుంటుంది. ఈ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురవొచ్చు. ఏపీలోని దక్షిణ కోస్తా, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్ద’ని ఐఎండీ సూచించింది. చెన్నై సహా ఉత్తర తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగాయి. చెన్నై శివారులోని పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేని వర్షం కారణంగా కాలనీలు జలదిగ్భధంలో చిక్కుకున్నాయి.

Also Read :

కేరళలో భారీ వర్షాలు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్