Friday, May 9, 2025
HomeTrending Newsతిరుమలలో భక్తుల రద్దీ.. అన్నీ కంపార్ట్ మెంట్లు ఫుల్

తిరుమలలో భక్తుల రద్దీ.. అన్నీ కంపార్ట్ మెంట్లు ఫుల్

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మొన్నటివరకు శ్రీవారి బ్రహోత్సవాల నేపథ్యంలో కొండపైకి పరిమితి సంఖ్యలోనే వాహనాలను అనుమతించారు. బ్రహోత్సవాలు ముగియడంతో  ప్రైవేట్ వాహనాల రాకపై ఉన్న ఆంక్షలు ఎత్తివేశారు.  దీంతో తిరుమల భక్తులతో కిక్కిరిసిపోయింది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి పోయి.. వెలుపల ఉన్న క్యూలైన్లలో సైతం భక్తులు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది.  ఆరు కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉంది.

క్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్నపానీయాలను టీటీడీ సిబ్బంది అందిస్తున్నారు . రద్దీని గమనించి భక్తులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. నిన్న స్వామి వారిని 72,195 మంది దర్శించుకున్నారు. 41,071 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. రూ.2.17 కోట్ల హుండీ ఆదాయం స్వామి వారి ఖాతాలో సమకూరింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్