Tuesday, June 9, 2026
HomeTrending Newsభక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

వరుస సెలవలు, పెళ్ళిల సీజన్ కావడంతో తిరుమల కొండ వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది.  శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరి ఉన్నారు.  వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి, ఆస్థాన మండపం వరకు క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. ఈ సాయంత్రానికి క్యూ లైను మరింతగా పెరిగే అవకాశం ఉంది.

 సోమవారం వరకూ సెలవులు ఉండడంతో మరో మూడునాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని శ్రీవారి ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.  సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.  వసతి గదులన్నీ నిండిపోయాయి.  గదులు దొరక్క భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular