Tuesday, June 16, 2026
HomeTrending Newsశ్రీశైలం జలాశయానికి భారీగా వరద

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు అనేక ప్రాజెక్టులు  పొంగి పొర్లుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. జూరాల ప్రాజెక్ట్‌ నుంచి 52,856 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది.

జలాశయం నీటిమట్టం గురువారం ఉదయం 6 గంటల సమయానికి 816.20 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 38.1234 టీఎంసీలుగా నమోదైంది. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular