మూడేండ్లుగా కొవిడ్-19 నియంత్రణలతో స్దబ్ధత నెలకొన్న అనంతరం ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులను స్వాగతించేందుకు హాంకాంగ్ సిద్ధమైంది. పర్యాటకులు, వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లను ఫైనాన్షియల్ హబ్‌కు తిరిగి ఆకర్షించే క్రమంలో ఐదు లక్షల ఉచిత విమాన టికెట్లతో కూడిన ప్రమోషన్ క్యాంపెయిన్‌ను హాంకాంగ్ లాంఛ్ చేసింది. హాంకాంగ్ నేత జాన్ లీ శుక్రవారం ప్రమోషన్ క్యాంపెయిన్‌ను ఆవిష్కరించారు. హలో హాంకాంగ్ పేరుతో రీబ్రాండింగ్ క్యాంపెయిన్‌ను ప్రభుత్వం చేపట్టింది.
రాజకీయ అణిచివేత, కొవిడ్ నియంత్రణలతో గత మూడేండ్లుగా చితికిన దక్షిణ చైనా సిటీ హాంకాంగ్ తిరిగి పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రచార హంగామాతో సిద్ధమైంది. నగర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ బిల్ బోర్డులు వెలిశాయి. వ్యాపార, పర్యాటక దిగ్గజాల సమక్షంలో ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను లాంఛ్ చేసిన లీ నగర అందాలను అనుభూతి చెందేందుకు విజిటర్ల కోసం అయిదు లక్షల ఉచిత విమాన ప్రయాణ టికెట్లు అందిస్తామని ప్రకటించారు.
ఉచిత విమాన టికెట్లను మార్చి నుంచి విజిటర్లకు అందచేయడం ప్రారంభిస్తారు. డియర్ లేడీస్..అండ్ జెంటిల్‌మన్.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వెల్‌కం ఆఫర్‌గా నిలిచిపోతుందని అతిధులను ఉద్దేశించి లీ పేర్కొన్నారు. హాంకాంగ్‌లోని ప్రముఖ హార్బర్ పక్కన కొలువుతీరిన మెయిన్ కన్వెన్షన్ సెంటర్‌లో డ్యాన్సర్ల హంగామా, నియోన్ లైట్ల ధగధగల మధ్య ఈ క్యాంపెయిన్‌ను లీ ప్రారంభించారు. విదేశీ పర్యాటకులకు మార్చి 1 నుంచి ఆరు నెలల పాటు ఉచితంగా పంచే విమాన టికెట్లను ప్రభుత్వం హాంకాంగ్ ఎక్స్‌ప్రెస్, హాంకాంగ్ ఎయిర్‌లైన్స్, ఎయిర్‌లైన్స్ క్యాథే పసిఫిక్‌లకు అందచేయనుంది.