Tuesday, July 7, 2026
HomeసినిమాRama Banam: ‘రామబాణం’ పెద్ద విజయం సాధిస్తుంది: గోపీచంద్

Rama Banam: ‘రామబాణం’ పెద్ద విజయం సాధిస్తుంది: గోపీచంద్

గోపీచంద్, ‘రామబాణం’ టీమ్ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రామిసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ నెలకొల్పింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కర్నూల్‌లో గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ లో సెకండ్ సింగిల్‌ దరువెయ్యరా పాటను విడుదల చేశారు.

గోపీచంద్ మాట్లాడుతూ.. మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా వుంది. నిర్మాత విశ్వ ప్రసాద్ గారితో ఇదే నా మొదటి సినిమా. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనకి సినిమాలు అంటే ప్యాషన్. ఆయనకి విజయాలు వస్తున్నాయి. ఇలాగే మంచి సినిమాలు చేస్తూ ఇంకా చాలా పెద్ద నిర్మాత అవ్వాలని, ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ పాటని లాంచ్ చేసిన టీజీ వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. యజ్ఞం సమయంలో ఆయన్ని కలుసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆయన సాంగ్ లాంచ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా ఆనందంగా  వుంది. ప్రేక్షకుల ఆశీర్వాదంతో రామబాణం కూడా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. అందరికీ కృతజ్ఞతలు” తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular